: 41 మెగా పిక్సల్ కెమెరా ఫోన్ ... 'నోకియా లుమియా 1020' ఆవిష్కరణ
41 మెగా పిక్సల్ కెమెరా ఫోన్ 'నోకియా లుమియా 1020' మోడల్ ను భారత్ లో ఆ సంస్థ ఆవిష్కరించింది. అక్టోబర్ 11 నుంచి మార్కెట్లో లభించనున్న ఈ కెమెరా మొబైల్ ఫోన్ ధర 48 వేల వరకు ఉండొచ్చని అంచనా. కచ్చితమైన ధరను అక్టోబర్ 10న ప్రకటించనున్నారు. నోకియా లుమియా శ్రేణికి ఆదరణ లభించిందని, నేటి నుంచి 'లుమియా 1020' భారతీయ వినియోగదారులను మెప్పించి, నోకియా సంస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుందని నోకియా ఇండియా మేనేజర్ బాలాజీ తెలిపారు.