: పెరగాల్సింది భూముల విలువ కాదు... ఫలసాయం విలువ: రోశయ్య
'పెరగాల్సింది భూముల విలువ కాదని, ఫలసాయం విలువ పెరగాల్సిన అవసరం ఉందని' తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహాల్ లో 'రైతు నేస్తం' 9 వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పారిశ్రామికీకరణ పేరిట వ్యవసాయ భూముల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతోందని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చేపట్టినా రైతుల జీవన ప్రమాణాల్లో మాత్రం మార్పు రావడం లేదని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు.