: అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ ముందుకు 'టీ నోట్': దిగ్విజయ్


అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని, ప్రాంతీయ పార్టీల్లాగా తమ నిర్ణయాలను మార్చుకోమని పేర్కొన్నారు. బిల్లు దశలో ఆంటోనీ కమిటీతో చర్చలు జరుపుతామని, అలాగే కమిటీ పరిశీలనలను నోట్ కు జతపరుస్తామని దిగ్విజయ్ చెప్పారు. అయితే, సీమాంధ్రకు మద్దతుగా మాట్లాడుతున్న సిఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలంటూ తెలంగాణ నేతలు చేస్తున్న ఆరోపణలకు దిగ్విజయ్ స్పందిస్తూ.. రాష్ట్రం విడిపోయేదాకా ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. కాగా, కిరణ్ ఆంధ్రా పక్షపాతి అంటూ వస్తున్న ఆరోపణలపై మాట్లాడేందుకు దిగ్విజయ్ నిరాకరించారు. కిరణ్ ఏ సందర్భంలో ఏం మాట్లాడారో తెలియదని.. తెలుసుకున్నాకే స్పందిస్తానన్నారు.

  • Loading...

More Telugu News