: ఇదే బుల్లి కుక్క.. రికార్డుల కెక్కిన మిల్లీ!
ప్రపంచంలోనే అతి చిన్న కుక్కగా 'మిరాకిల్ మిల్లీ' గిన్నిస్ రికార్డులకెక్కింది. అర కిలో బరువుతో కేవలం 9.65 సెంటీమీటర్ల పొడవున్న ఈ బుల్లి కుక్క పేరు మిరకిల్ మిల్లీ. అమెరికాలో పుయెర్టోరికాలోని డొరడాకు చెందిన వానెసా సెమ్లర్ కు ఇది పెంపుడు కుక్క. మిల్లీ 2011 డిసెంబర్లో పుట్టినప్పటికీ, దీని బరువు మాత్రం ఇంకా అర కిలోకు మించలేదు. ఇది పుట్టినప్పుడు దీని బరువు కేవలం 28.34 గ్రాములే. పొడవేమో టీస్పూన్ అంత ఉండేదట! యజమాని వానెసా దీనిని అతి జాగ్రత్తగా చూసుకుంటూ సంరక్షిస్తున్నాడు. ఇప్పుడీవిడ గారు గిన్నిస్ పుస్తకానికెక్కి తనతో బాటు యజమానికి కూడా పేరు తెచ్చింది!