: కేరళలో అమృతానందమయి ఆశీస్సులందుకున్న మోడీ
కేరళ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ కొల్లాంలోని మాతా అమృతానందమయిని దర్శించుకున్నారు. మాత 60వ పుట్టినరోజు వేడుకలకు హాజరైన మోడీ ఆమె ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "తాను ఇక్కడకు రాజకీయ నేతగా రాలేదని, అమ్మ ఆశీస్సుల కోసమే వచ్చా"నని మలయాళంలో అన్నారు. ఈ రోజు సాయంత్రం మోడీ తిరుచ్చిలోని ఒక ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ఈ ర్యాలీకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరవుతారని భావిస్తున్నారు.