: సెప్టెంబర్ 30న జగన్ కు గవర్నర్ అపాయింట్ మెంట్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలవాలనుకుంటున్న జగన్ కు సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు అపాయింట్ మెంట్ లభించింది. ఈ సందర్భంగా జగన్ తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ ను కలవనున్నారు. రాష్ట్రాన్ని విభజించకుడా సమైక్యంగానే ఉంచాలని ఆయన్ను కోరనున్నారు. దీనికోసం వెంటనే అసెంబ్లీని సమావేశపరచేలా చర్యలు తీసుకోవాలని విన్నవించనున్నారు.