: శని వలయాల్లో ఎన్నెన్నో బుల్లి చందమామలు!


ఏ కాస్త రొమాంటిక్ సెన్స్ ఉన్న వ్యక్తులకైనా చందమామ వెదజల్లే వెన్నెల వెలుగులకు గాఢమైన ప్రణయావేశం పెల్లుబకడం ఖాయం. అదే పదుల సంఖ్యలో చందమామలు మా అందం చూడవయా అంటుంటే.. అంత అందం ఏం చేయాలో పాలుపోక అలా నిబిడాశ్చర్యంతో శశికాంతులను ఆస్వాదిస్తూ నిలబడిపోతాం.

భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడి సొగసు మహిమ అలాంటిది. మరి మన కవులు చందమామను ఎంతో శ్రావ్యంగా గానం చేసిన సందర్బాలు పురాణ కాలం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు శని గ్రహం చుట్టూ ఉండే వలయాల్లో అనేకమైన చందమామలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

ఒక్క చందమామకే గంగవెర్రులెత్తిన రసజ్ఞులు ఈ మాట వింటే ఏమైపోతారో.. ! అయితే, టైటాన్ వాయు పరివేష్టితమైన శని గ్రహ వలయాల్లో ఆ బుల్లి చందమామలు కనిపించీ కనిపించనట్టు ఉన్నాయట. ఇవి మొత్తం 62 ఉన్నట్టు తేలింది. అయితే, ఆ వలయాల్లో చందమామలు మరికొన్ని ఉండే అవకాశం కూడా ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

  • Loading...

More Telugu News