: జమ్ము కాశ్మీర్ లో నరమేధం సృష్టించిన ముగ్గురు తీవ్రవాదులు హతం


పాశవికంగా దాడిచేసి 12 మందిని పొట్టనబెట్టుకున్న ముగ్గురు కరుడుగట్టిన తీవ్రవాదులు హతమయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన కాల్పుల్లో భారత జవాన్లు దాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టారు. చనిపోయిన తీవ్రవాదులు 16 నుంచి 19 ఏళ్ల వయసుగలవారిగా గుర్తించారు. ఈ రోజు ఉదయం ఒక పోలీస్ స్టేషన్ తో పాటు, ఆర్మీ కంటోన్మెంట్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. వీరి కాల్పుల్లో నలుగురు పోలీసులు, ఆరుగురు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. చనిపోయిన జవాన్లలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉన్నారు. ఈ ఘటనల్లో దాదాపు డజనుకు పైగా ప్రజలు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News