: రెండున్నర కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలంలో రూ. 2.5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న మోటుపల్లోళ్లవారిపల్లెలో నిల్వ ఉంచిన ఎర్ర చందనం గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి ఈ దుంగలను స్వాధీనం చేసుకున్నారు.