: భారీ చొరబాటును తిప్పికొట్టిన సైన్యం


జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదుల భారీ చొరబాటును భద్రతాదళాలు తిప్పికొట్టాయి. కేరన్ సెక్టర్ లో ఈ చొరబాటు యత్నం జరిగింది. దాదాపు 30 మంది తీవ్రవాదులు భద్రతాదళాల ఉచ్చులో చిక్కుకున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 24వ తేదీన ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సైనికులు వారిని హతమార్చడానికి ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటిదాకా పది నుంచి పన్నెండు మృతదేహాలు కన్పించినట్టు సైన్యం తెలిపింది. ఆపరేషన్ పూర్తయితే సమగ్ర సమాచారం లభిస్తుందని సైనికాధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం దేశంలోకి అక్రమంగా చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News