: రాజీనామాలతో సాధించేది ఏమీ లేదు : మంత్రి గంటా
సమైక్యాంధ్ర మ్యాచ్ ఇంకా ముగియలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. 50 రోజులు దాటినా తెలంగాణపై ముందడుగు పడకపోవడమే దీనికి నిదర్శనమని తెలిపారు. సమైక్య ఉద్యమంలో సీఎం కిరణ్ ఛాంపియన్ అని పేర్కొన్నారు. రాజీనామాల వల్ల మనం సాధించేది ఏమీ లేదని... కేవలం ప్రభుత్వం మాత్రమే పడిపోతుందని వివరించారు. ఈ రోజు గంటా ముఖ్యమంత్రి కిరణ్ తో సమావేశమయ్యారు. ఈ నెల 30న విశాఖలో ఫ్లైవోవర్ ను ప్రారంభించడానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్టు ఆయన మీడియాకు తెలిపారు.