: జగన్ బెయిల్ పై ప్రజల్లో అనుమానం వాస్తవమే: కావూరి
కాంగ్రెస్, వైఎస్సార్సీపీ రహస్య పొత్తువల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ లభించిందంటూ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రచారంపై కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ పై ప్రజల్లో అనుమానం ఉన్నమాట వాస్తవమేనన్నారు. ముందు ముందు ఏదైనా జరగొచ్చని చెప్పారు. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి దిగజారిందన్న కావూరి కేబినెట్ నోట్ పై తనకు ఎలాంటి సమాచారం లేదని ఢిల్లీలో చెప్పారు.