: ఉగ్రవాదుల దాడిలో 12 మంది మృతి
జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాలో హీరానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సైన్యం దుస్తుల్లో చొరబడ్డ ముష్కరులు హీరానగర్ పోలీస్ స్టేషన్ పై దాడికి తెగబడ్డారు. కాల్పుల్లో మొత్తం 14 మంది అసువులు బాయగా వారిలో ఆరుగురు జవాన్లు, నలుగురు పోలీసులు, ఇద్దరు ఉగ్రవాదులు, ఇద్దరు పౌరులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ పై కాల్పుల అనంతరం ఉగ్రవాదులు సాంబ జిల్లాలోని సైనిక స్థావరాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాశ్మీర్లో దాడులకు పాల్పడింది తామేనని అల్ షాహిదా తీవ్రవాద సంస్థ ప్రకటించింది.