: నిమ్మగడ్డ, బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణను సీబీఐ కోర్టు అక్టోబరు 3కి వాయిదా వేసింది. వీరి బెయిల్ పై ఏవైనా అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐని అడిగింది. ఇందుకు సీబీఐ గడువు కోరడంతో విచారణ వాయిదాపడింది.