: పార్టీలన్నీ సిద్ధాంతాలకు నీళ్లొదిలేశాయి: కావూరి
రాజకీయ పార్టీలన్నీ సిద్ధాంతాలకు నీళ్లొదిలేశాయని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఢిల్లీలో లేపాక్షి షోరూం ను ప్రారంభించిన ఆయన విభజన అంశంపై మాట్లాడుతూ, సీమాంధ్రలో పార్టీ పరిస్థితి పట్ల ఆవేదన చెందుతున్నానని అన్నారు. సిద్ధాంతాలకు పార్టీలు కట్టుబడి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆయన అన్నారు.