: బజ్జీలమ్మి నిరసన తెలిపిన ఉపాధ్యాయులు
కాకినాడలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతరూపం సంతరించుకుంటోంది. విభజనకు వ్యతిరేకంగా సాగుతున్న మహోద్యమాన్ని ఎవరూ ఆపలేరని నినదించిన ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు ఈ రోజు కాకినాడలో జిల్లా కలెక్టరేటు వద్ద బజ్జీలు వేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కారణంగా విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోవడంతో తమకు జీతాలు లేక బజ్జీలు అమ్ముకునే పరిస్థితి తలెత్తిందని ఉపాధ్యాయులు తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేసి తక్షణం ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.