: వీడు మనిషి కాదు..మృగం!


మానవత్వం మంటగలిసిపోతోంది. కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముక్కుపచ్చలారని పసిగుడ్డులను కూడా వదలట్లేదు. కీచకులకు సరైన శిక్షలు సకాలంలో పడకపోవడం, నాలుగు గోడల మధ్య శిక్షలు విధించడమే వారి ఆగడాలు పెరగడానికి కారణమేమో! చిత్తూరు జిల్లాలో సభ్యసమాజం తల దించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ చేసిన అప్పు తీర్చలేదని ఆమె ఐదేళ్ళ కూతురిని పది రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడో కామపిశాచి. వివరాల్లోకెళితే..

చిత్తూరు జిల్లా పలమనేరు శివార్లలో ఓ మహిళ కూలీగా పని చేస్తోంది. తన తల్లి వైద్యచికిత్స నిమిత్తం నాలుగు నెలల క్రితం 2 వేల రూపాయలను ముబారక్ అనే వ్యక్తి దగ్గర్నుంచి అప్పుగా తీసుకుంది. తన అప్పు తీర్చాలని ముబారక్ ఆమెను వేధించసాగాడు. ఓ రోజు ఆమె ఐదేళ్ళ కుమార్తెను తీసుకువెళ్ళిపోయాడా కిరాతకుడు. అప్పు తీర్చితేనే ఆ బాలికను వదిలిపెడతానని చెప్పాడు. అలా పదిరోజుల పాటు ఆ చిన్నారిని నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజులు గడుస్తున్నా తన కుమార్తెను వదిలిపెట్టకపోవడంతో ఆ తల్లి ఇరుగు పొరుగుకు విషయం తెలిపింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముబారక్ పరారీలో ఉండగా బాలికను పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News