: డీజీపీకి చుక్కెదురు
పదవీకాలం పొడిగించాలని కోరిన రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డికి చుక్కెదురైంది. డీజీపీ పదవీకాలాన్ని పొడిగించలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు క్యాట్ కు ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించనుంది. దినేశ్ రెడ్డి ఈ నెలాఖరుతో పదవీకాలం ముగియనుంది. తదుపరి పోలీస్ బాస్ గా ప్రసాద్ రావుకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.