: రెండో విడత సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత


రాష్ట్రంలో రెండో విడత సహకార ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో మొత్తం 32వేల 228 మంది అభ్యర్ధులు  బరిలో ఉండగా, 940 మంది ప్రాథమిక సహకార సంఘాలకు డైరెక్టర్లను ఎన్నుకొంటారు. ఇదిలావుంటే, సహకార ఎన్నికలు జరుగుతున్న వరంగల్ జిల్లా వర్దన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లను కేంద్రానికి తరలిస్తున్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిని టీడీపీ, టీఆర్ ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.

అదిలాబాద్ జిల్లా ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది. నిర్మల్ లోని కలబా స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద టీఆర్ ఎస్ 
అభ్యర్ధికి గుండెపోటు వచ్చి మృతి చెందడంతో అక్కడ విషాదం అలుముకుంది. ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, నోటిఫికేషన్ ప్రకారం రెండో దశలో 1484 సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, శాంతి భద్రతల దృష్ట్యా 68 సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. 475 సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.

  • Loading...

More Telugu News