: నైరోబీ కాల్పుల ఘటనలో మరో భారతీయుడు మృతి
కెన్యా రాజధాని నైరోబీలోని వెస్ట్ గేట్ మాల్ లో జరిగిన తీవ్రవాద దాడిలో మన దేశానికి చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. గుజరాత్ కు చెందిన జ్యోతిబాల ధర్మేశ్ షాపింగ్ మాల్ కాల్పుల్లో మృతి చెందినట్టు విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే మన దేశానికి చెందిన నాగరాజ్, పరాంశు జైన్, శ్రీధర్ నటరాజన్ మృతి చెందిన సంగతి తెలిసిందే.