: గెలాక్సీ క్యాటలాగ్‌ సిద్ధం


గెలాక్సీలు ఎన్ని వుంటాయి... అవి ఎలాంటి రకానికి చెందినవి? ఇలా గెలాక్సీలకు సంబంధించిన వివరాలతో కూడిన ఒక క్యాటలాగ్‌ను తయారుచేశారు. ఈ భారీ పని కేవలం అంతరిక్ష శాస్త్రవేత్తల వల్లే కాలేదు. ఈ కార్యంలో మామూలు పౌరులు కూడా పాలుపంచుకున్నారు. ఇలా ఇంతమంది ఒకరికి ఒకరు సహకరించుకుని మూడు లక్షల గెలాక్సీలకు సంబంధించిన భారీ క్యాటలాగ్‌ను తయారుచేశారు. ఈ తయారీలో సుమారు 83 వేలమంది పౌరశాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకున్నారు.

విశ్వంలోని ఒక గెలాక్సీ ఎలాంటిది? అనే విషయాలను తెలుసుకోవడానికి అనేక రకాలైన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గెలాక్సీ పరిమాణం, రంగు వంటి వాటిని కొలవడానికి కంప్యూటర్లు సాయం చేస్తాయి. అయితే వాటి ఆకృతి, వాటి నిర్మాణం వంటివాటిని గురించి తెలుసుకోవడానికి మనిషి మాత్రమే చేయాల్సివుంటుంది. గెలాక్సీ జూ-2 అనే పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు విశ్వంలోని గెలాక్సీల వర్గీకరణకు సంబంధించిన రెండవదశ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల నేతృత్వంలోని అంతర్జాతీయంగా సుమారు 83 వేలమంది వాలంటీర్ల బృందం సహకారంతో విశ్వంలోని మూడు లక్షల గెలాక్సీలను వర్గీకరించడం జరిగింది. స్లోవాన్‌ డిజిటల్‌ స్కై సర్వే కార్యక్రమంలో అందిన డేటాను ఆన్‌లైన్‌లో ఈ వాలంటీర్లకు చేరవేశారు. ఈ చిత్రాలను చూసిన వాలంటీర్లు, శాస్త్రవేత్తలు ఇచ్చిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఈ ప్రశ్నల్లో మీరు చూసిన గెలాక్సీకి చుట్లలు ఉన్నాయా? ఉంటే ఎన్ని వున్నాయి? లేదా గెలక్టిక్‌ బార్‌లు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు వాలంటీర్లకు వేశారు. అలాగే కచ్చితత్వంకోసం ప్రతి చిత్రాన్నీ నలభైనుండి యాభైసార్లు వర్గీకరించారు. ఈవిధంగా చేయడం వల్ల మూడు లక్షల గెలాక్సీలకు సంబంధించిన 1.6 కోట్ల వర్గీకరణలను తయారుచేశారు. ఇంతపెద్ద పనిని కేవలం ఒక శాస్త్రవేత్త చేయాలంటే కనీసం ముఫ్ఫై ఏళ్లు పట్టేదట.

  • Loading...

More Telugu News