: తొలి మహిళా ఎస్ బీఐ ఛైర్మన్ గా అరుంధతీ భట్టాచార్య?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ గా తొలిసారి ఒక మహిళ నియామకానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఎస్ బీఐ ఎండీ, సీఎఫ్ వో గా ఉన్న అరుంధతీ భట్టాచార్యను ఛైర్మన్ గా నియమించడానికి ఆర్ధికమంత్రి చిదంబరం ఆమోదం తెలిపినట్టు సమాచారం. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ అప్పాయింట్ మెంట్స్ కమిటీ కూడా ఆమోద ముద్ర వేస్తే ఆమె నియామకం అధికారికంగా పూర్తవుతుంది. ఇంటర్యూ పానెల్ వారం క్రితమే అరుంధతి, హేమంత్ కంట్రాక్టర్ ల పేర్లను ఎంపిక చేసి ఆర్ధిక మంత్రికి పంపింది. ఈ నెలాఖరులోపు కొత్త ఛైర్మన్ నియామకం జరగవచ్చని సమాచారం. ప్రస్తుత ఛైర్మన్ వచ్చే నెలలో పదవీవిరమణ చేయనున్నారు.