: అనారోగ్యంతో అమెరికాకు సోనియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె ఈ రాత్రి అత్యవసరంగా వైద్యపరీక్షల కోసం అమెరికా వెళుతున్నారు. 2011 ఆగస్టు 5 న సోనియాకు అమెరికాలో శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆమె ఏ వ్యాధితో బాధపడుతున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా ఉంచుతున్నాయి. సెప్టెంబర్ 2న తీవ్ర అనారోగ్యంతో ఆహారభద్రత బిల్లు సందర్భంగా ఎయిమ్స్ లో జాయిన్ అయి, అనంతరం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. మరోసారి హఠాత్తుగా అమెరికా పయనమవనుండడంతో సోనియా ఆరోగ్య పరిస్థితి పట్ల కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.