: అవగాహనతోనే వ్యాధిని గెలవగలం: అక్కినేని అమల
రొమ్ము క్యాన్సర్ వ్యాధిని అవగాహనతోనే గెలవగలమని సినీనటి అమల అన్నారు. హైదరాబాదులోని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 6న జరుపనున్న పింక్ రిబ్బన్ వాక్ ప్రచార కార్యక్రమాన్ని అమల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రొమ్ము క్యాన్సర్ పై అవగాహన లేకే చాలా మంది జీవితాలను కోల్పోతున్నారని ఆమె అన్నారు. చిన్న పరీక్షలతోనే బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించవచ్చని తెలిపారు. కాగా, హైదరాబాదులోని అసెంబ్లీ సహా పలు ప్రఖ్యాత కట్టడాలను తమ ప్రచారంలో భాగంగా గులాబీ రంగు వెలుగులతో నింపుతామని డాక్టర్ పి.రఘురాం తెలిపారు.