: జగన్ కు బెయిల్ కరెక్టే: పాల్వాయి


సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే తాజాగా సీబీఐ కోర్టు వైఎస్ జగన్ కు బెయిలిచ్చిందని పాల్వాయి గోవర్థన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జగన్ బెయిల్ పై కాంగ్రెస్ పార్టీని టీడీపీ నిందించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిని డిస్మిస్ చేసి, రాష్ట్ర విభజన పూర్తి చేయాలని పాల్వాయి డిమాండ్ చేశారు. తాము అధిష్ఠానం పెద్దలతో రాష్ట్ర ఏర్పాటు వేగవంతం చేయాలని కోరామని, కొంత కాలం ఉమ్మడి రాజధానికి కూడా ఆమోదం తెలిపామని పాల్వాయి తెలిపారు.

  • Loading...

More Telugu News