: వచ్చే ఎన్నికల్లో పోరాడేది కాంగ్రెస్ కాదు సీబీఐ: మోడీ
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. కాంగ్రెస్ పార్టీపై పలు వాగ్బాణాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో పోరాడేది కాంగ్రెస్ పార్టీ కాదని, సీబీఐ అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు సీబీఐని కాంగ్రెస్ అస్త్రంలా వాడుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ మళ్ళీ ఎమర్జెన్సీ పరిస్థితులనే కోరుకుంటోందని మోడీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ గుజరాత్ సీఎం ఉద్ఘాటించారు. అద్వానీయే తమ మార్గదర్శకుడని పేర్కొన్నారు.