: ఆధారాలు సేకరించడం పూర్తయింది: సబిత


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో ఆధారాలు సేకరించడం పూర్తయినట్టేనని రాష్ట్ర హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. నిందితుల కోసం వేటను ఇక ముమ్మరం చేస్తామని మంత్రి చెప్పారు. కాగా, బాంబు పేలుళ్లలో మరణించిన 16 మందిలో 14 మందికి పరిహారం చెల్లించామని ఆమె వెల్లడించారు.

మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, క్షతగాత్రుల్లో వైకల్యం బారిన పడినవాళ్లకూ దీన్ని వర్తింపజేసే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేయని సీసీ కెమెరాలను గుర్తించి వాటిని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News