: ముఖ్యమంత్రి నూరు శాతం సమైక్యవాదే: టీజీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నూటికి నూరు శాతం సమైక్యవాదేనని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. విభజన వల్ల మూడు ప్రాంతాలకూ నష్టం కలుగుతుందని సీఎం చెప్పడం తప్పేమీ కాదని ఢిల్లీలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాల మాటలతో విభజన అంశంపై ముందుకెళ్లడం సమంజసం కాదని అధిష్ఠానానికి సూచించారు. కాంగ్రెస్ లో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరెక్కడా లేదన్న టీజీ అందరినీ కలుపుకొని పోవాలన్నది దిగ్విజయ్ అభిప్రాయమని పేర్కొన్నారు.