: అద్వానీకి పాదాభివందనం చేసిన మోడీ


బీజేపీలో కోల్డ్ వార్ కు ముగింపు కార్డు పడినట్టే ఉంది. బీజేపీ అగ్ర నాయకుడు అద్వానీ, ప్రధాని అభ్యర్థి మోడీల మధ్య సయోధ్య కుదిరినట్టే కనిపిస్తోంది. ఈ రోజు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అద్వానీ, మోడీ సభా వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా అద్వానీకి మోడీ పాదాభివందనం చేశారు. తొలుత వేదికపైనున్న మోడీకి అద్వానీ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వెంటనే మోడీ ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. గత కొంత కాలంగా తూర్పు, పడమరలుగా ఉన్న వీరు... ఆత్మీయతానురాగాలను పంచుకోవడం జీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

నవంబర్ లో జరగనున్న శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని ఈ భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. దాదాపు 2 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్వానీ ప్రారంభోపన్యాసం చేస్తూ... మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలో 24 గంటలూ విద్యుత్ ను సరఫరా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మోడీనే అని ప్రశంసించారు. దీన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ ఆచరిస్తున్నారని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News