: అక్టోబర్ తొలి వారంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల కీలక భేటీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని మంత్రి శైలజానాథ్ అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల మొదటి వారంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం ఉంటుందని ప్రకటించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానాన్ని చర్చించనున్నామని ఆయన తెలిపారు.