: లలిత్ మోడీపై జీవితకాల నిషేధం
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఐపీఎల్ నిర్వహణ సందర్భంగా లలిత్ మోడీ ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డాడని క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీసీఐ అతనిపై వేటు వేసింది. 2010 ఐపీఎల్ సీజన్ సందర్భంగా మోడీ అవినీతిపై స్పందించిన బీసీసీఐ వెంటనే సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి లలిత్ మోడీ క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, మోడీపై నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ జరపతలపెట్టిన సర్వసభ్య సమావేశానికి ఢిల్లీ ట్రయల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. అయితే, బీసీసీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో సమావేశం నిర్వహణకు మార్గం సుగమం అయింది. సెప్టెంబర్ 21న ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు నిన్న కొట్టివేసింది.