: పాక్ తో చర్చలను ధ్రువీకరించిన మన్మోహన్ సింగ్
పాకిస్థాన్ తో భారత్ చర్చలు జరుపుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ధ్రువీకరించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాల్గొనేందుకు ఈ రోజు అమెరికా వెళ్లిన మన్మోహన్.. అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పలు విషయాలపై చర్చలు జరపనున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద పలుమార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్ల ప్రాణాలు తీసిన ఘటనపై మన్మోహన్ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది.