: అధిష్ఠానం నిర్ణయాన్ని మార్చుకోక తప్పదు: ఎంపీ అనంత
విభజనపై తీసుకున్న నిర్ణయంలో మార్పుండదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గట్టిగా చెబుతుంటే, ఆ పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాత్రం అధిష్ఠానం తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటు, తాము చేసిన రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, ఆమోదింపజేసుకుంటామని ఢిల్లీలో మీడియాతో అన్నారు. హైదరాబాద్ సీమాంధ్రులది కాదనే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు.