: ఏపీ పరిస్థితులపై సోనియాతో దిగ్విజయ్ భేటీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపైనా, అక్కడ పార్టీ వ్యవహారాలపైనా అధినేత్రికి దిగ్విజయ్ వివరిస్తున్నారు. ఇప్పటికి యాభై ఆరు రోజుల దాటిన సమైక్య ఉద్యమంతో సీమాంధ్రలో స్థంభించిన కార్యకలాపాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.