: 'అర్జున' అవార్డు అందుకున్న తెలుగుతేజం
భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పుసర్ల వెంకట సింధు 'అర్జున' అవార్డు స్వీకరించింది. వాస్తవానికి ఆగస్టు 31న ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవాల్సి ఉన్నా.. బిజీ షెడ్యూల్ కారణంగా సింధుకు వీలుపడలేదు. దాంతో, నిన్న సాయంత్రం ఢిల్లీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకుంది. 'అర్జున' పురస్కారం కింద సింధుకు ఓ జ్ఞాపికతో పాటు రూ.5 లక్షల నగదు అందించారు. 18 ఏళ్ళ ఈ తెలుగుతేజం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సింగిల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన తొలి భారత మహిళా షట్లర్ గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.