: రోడ్డును చేపల మార్కెట్ చేసిన సమైక్యవాదులు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. గత 56 రోజులుగా నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిన సమైక్య ఉద్యమం ఈ రోజు మత్స్యకారుల జేఏసీ వినూత్న నిరసనతో కొత్త పుంతలు తొక్కింది. విభజనకు వ్యతిరేకంగా, సమైక్యానికి మద్దతుగా కాకినాడ మత్స్యకారులు నడిరోడ్డును చేపల మార్కెట్టుగా మార్చి అమ్మకాలు కొనసాగించారు. స్పీకర్ షెడ్యూల్ తెలిసి కూడా రాజీనామా డ్రామాలాడుతున్న కాంగ్రెస్ ఎంపీల తీరును ఎండగడుతున్నారు మత్స్యకారుల జేఏసీ ప్రతినిధులు.