: 'కామన్వెల్త్' స్కాంలో కల్మాడీపై అభియోగాలు
కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణంలో నిందితులు సురేష్ కల్మాడి, మరో తొమ్మిది మందిపై ఢిల్లీలోని సీబీఐ కోర్టు నేరాభియోగాలు నమోదు చేసింది. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వీరిపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 20 నుంచి కోర్టు వీరిపై విచారణ ప్రారంభిస్తుంది.
2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ సంబంధించిన 'టైమింగ్, స్కోరింగ్' కాంట్రాక్టును నిబంధనలకు విరుద్ధంగా ఒక స్విస్ సంస్థకు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్పట్లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా వున్నసురేష్ కల్మాడీ తదితరులపై సీబీఐ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం వీరంతా బెయిల్ మీద బయటే వున్నారు.