: తెలంగాణ డిమాండును తిరస్కరించలేదు: వయలార్ రవి


తెలంగాణ రాష్ట్ర డిమాండును కాంగ్రెస్ ఎప్పుడూ తిరస్కరించలేదని, అది ఎప్పటినుంచో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు వయలార్ రవి అన్నారు. ఈ అంశంపై మిగతా ఎంపీలందరితో చర్చిస్తానని ఆయన తెలిపారు. పార్టీల మద్దతు వుందన్న ఒక్క ప్రాతిపదికను తీసుకొని తెలంగాణపై నిర్ణయం తీసుకోలేము కదా? అని అన్నారు. అయితే పార్టీల మద్దతు లభిస్తే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేందుకు అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ ఉదయం ఎంపీ మధు యాష్కీ ఢిల్లీ లో వయలార్ తో 
ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులను యాష్కీ ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ నెల మరోసారి అందరం కలిసి చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ సెంటిమెంటును యాష్కీ తనకు వివరించారని చెప్పారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తామన్న ప్రకటనను ఈ సందర్భంగా వాయలార్ ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News