: పోలీసుల అదుపులో 9మంది బాల నేరస్తులు


తిరుపతిలోని బాలుర పరిశీలన, సంస్కరణ గృహం (జువనైల్ హోం) నుంచి నిన్న రాత్రి తప్పించుకున్న బాల నేరస్తుల్లో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది బాలురు సిబ్బంది కళ్లుగప్పి పరారైన విషయం తెలిసిందే. పరారీకి సంబంధించిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్లలో 9 మంది బాల నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని పట్టుకోవడం కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో నేరాలకు పాల్పడిన బాల నేరస్తులను ఈ జువనైల్ హోంలో ఉంచుతారు.

  • Loading...

More Telugu News