: 217కు చేరిన పాకిస్థాన్ భూకంప మృతుల సంఖ్య
పాకిస్థాన్ నైరుతి ప్రాంతంలోని బెలూచిస్థాన్ లో సంభవించిన భూకంపంలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 217కు చేరుకుంది. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. నిన్న (మంగళవారం) సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదయిన సంగతి తెలిసిందే. వందలాది ఇళ్లు, భవనాలు, వాణిజ్య సముదాయాలు కూలిపోయాయి. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో ఇంకా తెలియలేదని పునరావాస చర్యలు చేపడుతున్న అధికారులు తెలిపారు. భూకంప ప్రాంతంలో భద్రతా దళాలు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.