: రాహుల్ ను పీఎం చేయాలన్న లక్ష్యంతోనే జగన్ కు బెయిల్: టీడీపీ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంపై టీడీపీ మండిపడుతూనే ఉంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న సోనియాగాంధీ ఏకైక లక్ష్యంతోనే జగన్ కు బెయిల్ వచ్చిందని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డారని విశాఖలో తీవ్ర ఆరోపణలు చేశారు.