: నిండు కుండలా నాగార్జున సాగర్
భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండటంతో... అక్కడి నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో సాగర్ కు 2.15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ 18 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాగా, గుంటూరు జిల్లా మాచర్ల మండలం లింగాపురం వద్ద సాగర్ కుడి కాలువకు గండి పడింది. దీంతో ఇక్కడి పంట పొలాలు నీట మునిగాయి.