: ఢిల్లీ వెళుతున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు


సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నేడు హస్తిన బాట పట్టనున్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ... ఢిల్లీలో 4 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ వివరాలను సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఛైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. 'ఈ నెల 26న కొవ్వొత్తుల ప్రదర్శన, 27న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని' ఆయన తెలిపారు. ఈ నెల 30న సీమాంధ్ర ఉద్యోగులు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News