: నీటిని ఇలా కూడా శుభ్రం చేయవచ్చట


నీటిని శుభ్రం చేయడానికి పలు రకాల మార్గాలను శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తాజాగా సీడీలతో కూడా కలుషిత నీటిని శుభ్రం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సీడీలను నీటిలో వేసి తిప్పడం వల్ల నీటిని శుభ్రం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సీడీలలో జింక్‌ ఆక్సైడ్‌ ఉంటుందని, అందువల్ల నీటిలో సీడీలను వేసి తిప్పడం వల్ల నీటిలోని కలుషిత రసాయనాలు తొలగిపోతాయని నేషనల్‌ తైవాన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి రెండువేల కోట్ల సీడీలు ఉత్పత్తి అవుతున్నాయని వీటిని సద్వినియోగం చేసుకుంటే కలుషిత నీటిని శుభ్రం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, వీరు సీడీలతో చిన్నపాటి నీటి శుద్ధీకరణ ప్లాంటును ఏర్పాటు చేసి నీటిలోని 95 శాతం కలుషిత పదార్ధాలను తొలగించారు కూడా!

  • Loading...

More Telugu News