: జగన్ నివాసం వద్ద బంధువుల హడావుడి
జగన్ కు బెయిల్ లభించడం పట్ల వైఎస్సార్సీపీ శ్రేణుల్లోనే కాదు, ఆయన బంధువర్గంలోనూ హర్షం వ్యక్తమవుతోంది. అటు జగన్ బంధువులు,ఇటు ఆయన భార్య భారతి తరుపు బంధువులు పెద్ద ఎత్తున లోటస్ పాండ్ లోని నివాసానికి వచ్చారు. బెయిల్ పై విడుదలైన జగన్ ను పరామర్శించేందుకు వారంతా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కార్యకర్తల సందడితో లోటస్ పాండ్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.