: వైఎస్ విగ్రహానికి పూలమాలపై పోలీసులతో జగన్ చర్చలు
చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన జగన్ భారీ కాన్వాయ్ తో నివాసానికి పయనమైన సంగతి తెలిసిందే. అయితే మార్గమధ్యంలో పంజాగుట్ట సెంట్రల్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసే విషయమై జగన్ పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు. వారు అనుమతిస్తే తండ్రి విగ్రహానికి పూలమాల వేసి ఆశీస్సులందుకోనున్నారు. ప్రస్తుతం జగన్ కాన్వాయ్ సోమాజిగూడ చేరుకుంది.