: చలనచిత్ర శత వసంతాల ముగింపు వేడుకకు రాష్ట్రపతి
చెన్నైలో జరుగుతున్న భారతీయ చలనచిత్ర శత వసంతాల ముగింపు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జ్యోతి వెలిగించి ముగింపు ఉత్సవాలకు పచ్చజెండా ఊపారు. కాగా ఈ ఉత్సవాలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, రేఖ తదితరులు హాజరయ్యారు. పలు సినీ పరిశ్రమలకు చెందిన పాత, కొత్త తరం నటీనటులు ఈ ఉత్సవాల్లో సందడి చేశారు.