: ఫోన్లు చేసి విసిగించే సంస్థలపై ట్రాయ్ ఆగ్రహం
బ్యాంకులు, బీమా, వాణిజ్య సంస్థలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా టెలీ మార్కెటింగ్ కు పాల్పడటాన్ని తప్పు పట్టింది. నమోదుకాని వినియోగదారులకు వ్యాపార ప్రచారం కోసం ఫోన్లు చేయడం, ఎస్సెమ్మెస్ లు పంపడం సరికాదని పేర్కొంది. ఎస్ బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రాలతో పాటు పలు సంస్థలకు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలను మూడుసార్లు అతిక్రమిస్తే ఆయా సంస్థలకు దేశవ్యాప్తంగా టెలికాం సేవలను నిలిపేస్తామని స్పష్టం చేసింది.