: ముడుపులు చెల్లించుకుని బయటికొచ్చాడు: ఉమ


అక్రమాస్తుల కేసులో బెయిల్ తెచ్చుకునేందుకు జగన్ ముడుపులు, కప్పం చెల్లించుకున్నాడని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మధ్య ఒప్పందంతోనే జగన్ కు బెయిల్ వచ్చిందని తెలిపారు. తన వంతుగా కాంగ్రెస్ సీబీఐ జేడీని బదిలీ చేసి జగన్ కు మార్గం సుగమం చేసిందని ఉమ విమర్శించారు. కాగా, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి అక్టోబర్ 6 వరకు కృష్ణా జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News