: ఎంజే మార్కెట్ చేరుకున్న జగన్ కాన్వాయ్
చంచల్ గూడ జైలు నుంచి బయటికొచ్చిన జగన్ భారీ భద్రత నడుమ నేరుగా ఇంటికి పయనం కాగా, ఆయనను చూసేందుకు జనం తండోపతండాలుగా విచ్చేశారు. దీంతో, చంచల్ గూడ నుంచి లోటస్ పాండ్ చేరుకునే మార్గంలో రహదారులు కిక్కిరిసిపోయాయి. జగన్ వాహనం ఎంజే మార్కెట్ వద్దకు రాగానే ఒక్కసారిగా అభిమానులు రోడ్లపైకి ఉరికారు. దీంతో, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక అభిమానులను సంతోషపరిచేందుకు జగన్ తాను ప్రయాణిస్తున్న వాహనం టాప్ పైకి ఎక్కి వారికి అభివాదం చేశారు.